నిరుపేద వృద్దురాలికి మిషన్ స్మైల్ సంస్థ అండ

నిరుపేద వృద్దురాలికి మిషన్ స్మైల్ సంస్థ అండ

1
TMedia (Telugu News) :

నిరుపేద వృద్దురాలికి మిషన్ స్మైల్ సంస్థ అండ

టీ మీడియా,జులై 25,పెద్దపల్లి :

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన జగదాంబ అనే అనాద వృద్ధ మహిళ(72) స్థానికంగా ఇళ్లలో అడుక్కుంటూ జీవనం సాగిస్తుంది.వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సామాజిక సేవకురాలు,మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ సభ్యురాలు మాదురి మన సంస్థకి సమాచారం అందించగా స్పందించిన సభ్యులు అక్కడకి చేరుకొని పెద్దపల్లి లోని సఖి కేంద్ర నిర్వాహకుల సహకారంతో ఆ అవ్వను సఖి కేంద్రానికి తరలించడం జరిగింది.

 

Also Read : కేటీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన ఉద్యమకారుడు

ఈ కార్యక్రమంలో మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ కోశాధికారి బత్తిని అనిల్ మాట్లాడుతూ…ఆనాద అవ్వకు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సఖి కేంద్రంలో సంప్రదించాలని, అలాగే ఒక కాల్ చేయగానే స్పందించి ఆ అవ్వను చేరదీసిన సఖి కేంద్ర నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మిషన్ స్మైల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గంగిపెల్లి విద్యాసాగర్,ప్రధాన కార్యదర్శి పూసాల అఖిల్,సంయుక్త కార్యదర్శి కాశిపాక ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube