ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్‌తో చెప్పించారు
-బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
టీ మీడియా, ఫిబ్రవరి 3, హైదరాబాద్ : ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్‌తో చెప్పించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. ధరణి గురించి ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గంటల కరెంట్ కూడా రావట్లేదని రైతులు సబ్ స్టేషన్లో వద్ద ఆందోళన చేస్తున్నారని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో అనేక అబద్ధాలు ఉన్నాయని మండిపడ్డారు. ప్రసంగంలో ధరణి ప్రస్తావన లేదన్న ఈటల.. ప్రభుత్వం ఇచ్చిన ప్రతిని మాత్రమే గవర్నర్ చదివారని ఆక్షేపించారు. ధరణితో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నా.. ఆ విషయంపై నోరు మెదపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులతో మాత్రమే అర్బన్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారని చెప్పారు. గజ్వేల్ సిద్దిపేట తప్ప ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించలేదని ఫైర్ అయ్యారు.ధరణీ, డబుల్ బెడ్ ఇళ్లు రాకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న ఈటల.. గొప్పలు చెప్పుకోడానికి మాత్రమే ఈ ప్రసంగం పనికి వస్తుందని తీవ్ర విమర్శలు చేశారు.
Also Read : దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ
కాగా.. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా విలసిల్లుతోందన్న గవర్నర్.. సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కొనియాడారు. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందిందన్నారు. కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టి, దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మిస్తున్నారని వివరించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube