పూజగది విషయంలో అసలు చేయకూడని తప్పులివే..

పూజగది విషయంలో అసలు చేయకూడని తప్పులివే..

0
TMedia (Telugu News) :

పూజగది విషయంలో అసలు చేయకూడని తప్పులివే..

లహరి, ఫిబ్రవరి 2, ఆధ్యాత్మికం : మనలో చాలా మంది ఇప్పటికీ వాస్తు శాస్త్రాన్ని ప్రగాఢంగా నమ్ముతారు. ఇంకా వాస్తు నియమాలను తూచా తప్పక పాటించి తీరుతారు. ఈ క్రమంలోనే వాస్తు ప్రకారం ఇంటిలోని పూజగది ఎల్లప్పుడు కూడా ఈశాన్య లేదా ఉత్తర దిశలలోనే ఉండాలి. ఆర్థిక లాభం, కుంటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఇంట్లో పూజగది సరైన దిశలో ఉండటం చాలా ముఖ్యమని వాస్తు నిపుణులు అంటున్నారు. లేకపోతే కుబుంబంలో ఆరోగ్య సమస్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో పూజగది ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పూజ చేసే ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరగడం ప్రారంభమవుతుంది. విశ్వాసం ప్రకారం పూజగది సరైన దిశ, అందులోని దేవుని విగ్రహాల, చిత్రాల సరైన దిశను తెలుసుకోవడం కూడా అవసరం. ఇంట్లో కట్టుకున్న గుడి వాస్తుకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉంటే, పూజ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రతతో ఉండదని, పూజ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని చెబుతారు వాస్తు నిపుణులు. ఇంకా ఆ ఇంటికి దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అవుతుందని వారు అంటున్నారు. ఈ క్రమంలో మీ పూజగది కోసం మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని వాస్తు చిట్కాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..


వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది సరైన దిశలో ఉండాలి. పూజగది సరైన దిశలో లేకుంటే పూజలకు ప్రయోజనం ఉండదని వాస్తు నిపుణులు అంటున్నారు. అందుకే పూజగది ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదికి దక్షిణం లేదా పడమర దిశ అశుభం. అదే సమయంలో ఇంటి గుడిలో రెండు శంఖాలను కలిపి ఉంచడం కూడా సరికాదు.
వాస్తు శాస్త్రం ప్రకారం, పూజగదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్టించకూడదు. ఇది అత్యంత అసహ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. అంతే కాదు విరిగిన విగ్రహాలను పూజిస్తే దేవతలకు కోపం వస్తుంది.
వాస్తు ప్రకారం పూజ గది ఎప్పుడూ స్టోర్‌రూమ్, బెడ్‌రూమ్, బేస్‌మెంట్‌లో ఉండకూడదు. పూజా గది ఎల్లప్పుడూ బహిరంగ ప్రదేశంలో నిర్మించాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని గుడిలో ఒకటి కంటే ఎక్కువ దేవుడి చిత్రాలను ఉంచవద్దు. అలాగే 3 వినాయక విగ్రహాలు ఉండకూడదని గుర్తుంచుకోండి. దీని వల్ల ఇంటి శుభ కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి.
హనుమాన్ పెద్ద విగ్రహాన్ని పూజగది‌లో ఉంచకూడదని వాస్తు నిపుణులు అంటుంటారు. పూజగదిలో ఆయన విగ్రహం ఎప్పుడూ చిన్నదిగా ఉండాలి. దీనితో పాటు, బజరంగ్ బలి కూర్చున్న విగ్రహాన్ని ఉంచడం మంచిదని చెబుతున్నారు. దీనితో పాటు, శివలింగం కూడా పూజగది‌లో ఉండాలని వారి మాట.

Also Read : ఇంటి ముందు ముగ్గుతో గ్రహదోష నివారణ..! ఆరోగ్య ప్రయోజనాలు

వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా గుడి దగ్గర టాయిలెట్లు కట్టకండి. చాలా సార్లు ఇంట్లో వంటగదిలోనే పూజగదిని కూడా ఏర్పాటు చేస్తారు. కానీ వాస్తు ప్రకారం వంటగదిలో కూడా ఈ పూజగది ఉండకూడదు. ఇలా చేయడంతో ధనలక్ష్మికి కోపం వస్తుంది.
ఇంట్లోని పూజగదిలో ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండే దేవుళ్ళ, దేవతల చిత్రాలను ఉంచాలి. అలా కాకుండా దేవతామూర్తుల ఉగ్ర రూపాల చిత్రాలను ఉంచవద్దు. అలా చేయడం అశుభంగా భావిస్తారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube