మిట్ట కోల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలకలు, పుస్తకాలు పంపిణీ

మిట్ట కోల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలకలు, పుస్తకాలు పంపిణీ

1
TMedia (Telugu News) :

మిట్ట కోల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలకలు, పుస్తకాలు పంపిణీ

టీ మీడియా , జూన్ 23 , దుమ్ముగూడెం:దుమ్ముగూడెం మండల పరిధిలోని కొమ్మనపల్లి, అడవిరామారం, ఎర్రబోరు మారుమూల ఏజెన్సీ ఆవాస గ్రామాలైన ప్రాంతంలోనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు(87)మంది 01 తరగతి నుండి 05తరగతి విద్యార్థులకు హనుమకొండ జిల్లాలో ఉన్న మిట్ట కోల సోమక్క నర్సయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫెసనరీ సామాగ్రి పంపిణీ చేశారు దుమ్ముగూడెం ఎంపీడీవో మిట్టకోల చంద్రమౌళి నేతృత్వంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం సి ఈ ఓ నాగలక్ష్మి పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు, పెన్సిల్, స్కేల్, బ్యాగులు, స్వీట్స్ పంపిణీ చేశారు.

Also Read : రైతు బంధు కోసం కాంగ్రెస్ ధర్నా

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏజెన్సీ మారుమూల గ్రామాలైన విద్యార్థులకు సేవ కార్యక్రమాలనుఅభినందించారు గత వారం నుంచి సేవలందిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రోత్సహించి దుమ్ముగూడెం మండలానికి సేవా కార్యక్రమాలు చేయడానికి ఏర్పాటు చేసిన ఎంపీడీవో చంద్రమౌళి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లక్ష్మి, జడ్పిటిసి సీతమ్మ, తాసిల్దార్ చంద్రశేఖర్, ఎం పి ఓ ముత్యాలరావు, సర్పంచ్ గోంది వెంకటేష్, బాలకృష్ణ ఏ పీ ఓ సుకన్య, ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, టైపిస్ట్ సాయిబాబా,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube