ఎమ్యెల్యే బట్టి మిక్రమార్కమాటలు అర్ధరహితం

అర్ధరహిక వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజలు మిమ్మల్ని మరింత చిదరించుకుంటారు అని మధిర కాంగ్రెస్ ఎమ్యెల్యే మల్లు బట్టి విక్రమార్క ను ఉద్దేశించి టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు అన్నారు.కరోణ కష్టకాలంలో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అన్నారు.
అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే 2023 ఎన్నికల్లో మంత్రి పువ్వాడ గారి పై పోటీ చేసి గెలిచి నిరూపించుకోవాలి*
ప్రతిపక్ష హోదాకి దూరమైన బట్టి కి మతి భ్రమించింది*

గురువారం ఖమ్మం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎమ్మెల్యే రాములు నాయక్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బోర్ర రాజశేఖర్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాత మధు, జిల్లా కార్యాలయ ఇంచార్జి RJC కృష్ణ.* తదితరులు పాల్గొన్నారు
.కరోనా కష్టకాలంలో ప్రజలకు ధైర్యం నింపాల్సిన నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సిగ్గుచేటు ప్రతిపక్ష హోదా కోల్పోయిన భట్టి విక్రమార్క మతిభ్రమించి మాట్లాడుతున్నారు ఇకనైనా మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజలు మరింత చీదరించుకుంటారు.నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితుల నుంచి నేడు ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నరు అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి కృషితోనే సాధ్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులు దయనీయ పరిస్థితి ప్రజలకు తెలుసు మీ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులకు భ్రష్టు పట్టించారు నేడు జిల్లా కేంద్రంలో మాత శిశు కేంద్రం 250 పడకల ఆసుపత్రిని 500 పడకలకు ఆధునిక రెండుసార్లు కాయకల్ప అవార్డు ఆసుపత్రి ఆధునీకరణ జరిగిందంటే మంత్రి పువ్వాడ కృషి ఫలితమే మీ హయాంలో ఏం చేశారు..? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మీరు చేసే ఆరోపణలలో ఈసుమంతైన నిజం ఉందా లేక తెలిసీ తెలియక చేస్తున్న చిల్లర రాజకీయాల..? ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నెంబర్ వన్ స్థానంలో అనేక సేవలు ఇస్తుంది.. కరోనా కష్టకాలంలో ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు చేస్తున్న సేవలు మీ కంటికి కనపడటం లేదా ఇప్పటి వరకు అనేక మందికి వైద్య సేవలు అందించి నయం చేసి ఇంటికి పంపారు మరింత మెరుగైన చికిత్స కోసం ఇటీవలే ఏర్పాటుచేసిన ట్రూనాల్ పరికరం పై బట్టి చేసిన చౌకబారు ఆరోపణలు ఖండిస్తున్నాం ట్రునాల్ పరికరం ద్వారా పరీక్షలు చేయాలంటేకొన్ని విధానాలు కొన్ని సేఫ్టీ మెజర్స్ తో నిర్వహించాల్సి ఉన్నది అమర్చిన అనంతరం ఐసీఎమ్ఆర్కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది వెంటనే ప్రారంభించడానికి అదేమన్నా పాన్ డబ్బా అనుకుంటున్నారా లేక పరీక్షకేంద్రం అనుకుంటున్నారా..? లేక కువైట్ పరీక్ష కేంద్రం అనుకుంటున్నారా..? పూర్తి వాస్తవాలు తెలియకుండా మాట్లాడటం మీకు తగదు.. బట్టి ప్రతిపక్ష హోదా కోల్పోయిన తరువాత మతిభ్రమించి మాట్లాడటం పరిపాటిగా మారింది.ఖమ్మం అభివృద్ధి గురించి పారిశుద్ధ్యం గురించి వెకిలి వ్యాఖ్యలు అర్ధరహిత ఆరోపణలు చేశారు మీకు అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే సత్తా ఉంటే అదే పువ్వాడ అజయ్ కుమార్ మీద వచ్చే 2023 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది అభివృద్ధి చేసి చెప్పాలని సవాల్ విసురుతున్న…ఎందుకంటే నీ మధిర రిజర్వ్ సీట్లో అజయ్ కుమార్ గారు పోటీ చేయలేరు కాబట్టి మీరే వచ్చి ఖమ్మంలో పోటీ చేసి మీ చిత్తశుద్ధి ఏమిటో నిరూపించుకోవాలి అప్పుడు మీకు కూడా చూపిస్తారు అజయ్ కుమార్ గారు సత్తా ఏమిటో…అభివృద్ధిలో అజయ్ కుమార్ గారు అగ్రగామిగా ఉన్నారు కాబట్టి దాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ భయంతో పువ్వాడ అజయ్ కుమార్ గారిని ఓడించేందుకు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు ఖమ్మం తీసుకువచ్చారు మహాకూటమిలో పార్టీలు కలిసి పోటీ దిగారు అయినప్పటికీ మీ ఆటలు సాగనివ్వం లేదు ప్రజలు ఎప్పుడూ కూడా అభివృద్ధిని కాంక్షించే అజయ్ కుమార్ గారి వెంట నిలబడ్డారు సత్తా ఉంటే 2023లో పోటీ చేసి మీ బలాన్ని నిరూపించుకోండి..అభివృద్ధి విషయంలో గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ కొత్త బస్టాండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఐటీ హబ్ లకారం ట్యాంక్బండ్ సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ పార్కులు రైతుబజార్లో పబ్లిక్ టాయిలెట్లు ఇవన్నీ కూడా మీరు పెట్టిన జెండా కాదు అజయ్ కుమార్ గారు స్వయంగా ఆలోచన చేసి ప్రజా ప్రయోజనాలు కార్యక్రమాలను చేపట్టారు ఈ పరిస్థితుల వల్ల రెండు నెలలు ఆలస్యం జరిగి ఉండవచ్చు కానీ నగరంలో కొనసాగుతున్న 100% ప్రతిదీ కూడా పూర్తిచేసి ప్రజల ముందుకు వెళదాం అన్నారు ఇటీవల జరిగిన కార్పొరేషన్ రివ్యూ మీటింగ్ కి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను పిలువలేదని మాట్లాడారు మీకు తెలుసో లేదో ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను పిలవరు కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్సీగా డిప్యూటీ స్పీకర్ హోదా పనిచేసిన మీకు ఆ మాత్రం తెలియకపోవడం హాస్యాస్పదం మున్సిపల్ కార్పొరేషన్ చట్టబద్ధమైన సమావేశాలుఉంటే అందర్నీ పిలవాలన్న రూలేమీ లేదు రివ్యూ మీటింగులకు అధికారులే ప్రదానం మంత్రి లేక జిల్లా కలెక్టర్ నిర్ణయం మేరకు ఆధారపడి ఉంటుంది తప్ప మీ ప్రమేయం అవసరం లేదు దానికి ప్రోటోకాల్ అని పేరు పెట్టి తప్పుదోవ పట్టించిన అవసరం లేదు..కరోనా సమయంలో చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది గడిచిన ఐదు నెలల నుంచి నిత్యం ప్రజల్లోనే ఉంటూ అటు ప్రభుత్వం నుండి ఇటు జిల్లా యంత్రాంగం నుండి ప్రజలకు అన్ని సౌకర్యాలు తీసుకొచ్చింది పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆ సమయంలో పూర్తిగా అందుబాటులో ఉండి సొంత నిధులతో సైతం పేదలకు అండగా నిలబడింది అజయ్ కుమార్ గారు… మీ ముసలి కన్నీరు ప్రజలు గమనిస్తారు కరోనా నివారణ కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంది ఇప్పటికే ఉచిత కిట్స్ రాపిడ్ టెస్ట్ కిట్ లు ఎన్ని కావాలంటే అన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు ఎక్కడంటే అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తో సహా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం యంత్రాంగం సిద్ధంగా ఉంది ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకుని ప్రజలకు అందుబాటులో ఉండి మీ పాత్ర నిర్వహించాలిఅని అన్నారు.