టీ మీడియా ఏప్రిల్ 7,పెద్దశంకరంపేట:
నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులతో కలిసి టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి విదేశాల్లో ఉన్న ఎమ్మెల్యేకు పోన్లో శుభాకాంక్షలు తెలిపారు.
కార్యకర్తలు కేక్ తో పాటు స్వీట్లు పంచుకున్నారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నిరంతర కృషిచేస్తున్నాడన్నారు. పెద్దశంకరంపేట మండల అభివృద్ధికి కృషిచేస్తున్న ఎమ్మెల్యేకు ఎల్లవేలలా రుణపడిఉంటామన్నారు. అనంతరం స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, మండల రైతుబంధు అధ్యక్షులు సురేష్ గౌడ్, సర్పంచ్ సత్యనారాయణ, నాయకులు వేణు గౌడ్, సుభాగౌడ్, మానిక్ రెడ్డి, శంకర్ గౌడ్, మల్లేశం, శంకరయ్య, రవిందర్,
పున్నయ్య, రాజేశ్వర్, రాంచందర్, తదితరులు పాల్గొన్నారు.