ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్షమాపణ చెప్పాలి

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్షమాపణ చెప్పాలి

0
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు క్షమాపణ చెప్పాలి

టీ మీడియా, ఫిబ్రవరి 1 , తిరుమలాయపాలెం : కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ పాలేరు నియోజకవర్గ కమిటీఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో పాలేరు అసెంబ్లీ బీఎస్పీ అధ్యక్షులు వెన్నబోయిన రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అధికారం ఉన్నదన్న అహంభావంతో స్థాయిని మరచి జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమారుని విమర్శించటం తగదన్నారు రాజ్యాంగాన్ని మారిస్తే ఏమవుతుంది అని అన్నటువంటి వ్యక్తులకు వత్తాసు పలుకుతూ బహుజన సమాజ్ పార్టీ నాయకులను విమర్శించటం తగదు అన్నారు అలా వ్యంగ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడిన మాటలను వెనుకకు తీసుకుంటున్నాను అని బహుజన సమాజ్ పార్టీ నాయకులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని. లేకుంటే అతనిపై చర్య తీసుకోవడానికి వెనకాడ బోమని గువ్వల బాలరాజు దళిత ద్రోహి అని 2014లో దళిత ముఖ్యమంత్రిని చేస్తామని టిఆర్ఎస్ మేనిఫెస్టోలో తెలిపితే గువ్వల బాలరాజు అనే వ్యక్తి దళితులకు పదవి అవసరం లేదు అని చెప్పినటువంటి దళిత ద్రోహి అని తెలిపారు.

Also Read : మొదటిరోజు ప్రారంభమైన ధ్వజస్తంభ ప్రతిష్ట

అలాగే బహుజన సమాజ్ పార్టీ అగ్ర నేత పేద విద్యార్థుల జీవితంలో వెలుగులు నింపిన బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి గువ్వల బాలరాజు 24 గంటలు దాటకముందే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మరొక మారు హెచ్చరించారు లేనిచో అతని కార్యక్రమాలు ఎక్కడున్నా సరే అతను బయటికి వెళ్లిన మరుక్షణమే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తల మైనటువంటి మేము అడుగడుగునా అడ్డుకుని తీరుతామని తెలియజేశారు ఈ సమావేశంలో పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా ఉపేందర్. ప్రధాన కార్యదర్శి మట్టే నాగేశ్వరరావు. సీనియర్ నాయకులు నల్లగట్టు శంకర్. జిల్లా ఇన్చార్జి బచ్చలకూరి శ్రీకాంత్. మండల నాయకులు వెంకన్న . నాగేష్. సుధాకర్ గౌడ్. తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube