చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 16 వనపర్తి :పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య లివర్కు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం చేసుకునే ఆర్థిక స్తోమత లేనందున ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా వారు స్పందించి వారికి మెరుగైన వైద్యం నిమిత్తం రెండు లక్షల సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన చెక్కును గురువారం వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి అందజేయడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్వోసీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కి మరియు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు గణేష్ రావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంచందర్ యాదవ్, పరమేష్, అజయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Chandrayya , a resident of Satapur village in Peddakottapally zone , is undergoing treatment at the NIMS Hospital in Hyderabad.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube