బొడ్రాయి పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే
టీ మీడియా ,జూన్ 24,వనపర్తి బ్యూరో : ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వీపనగండ్ల మండలం గోపాల్ దీన్నే గ్రామంలో గురువారం నిర్వహించిన బొడ్రాయి పండగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానించిన గ్రామ ప్రజలు, గ్రామ దేవతల దీవెనలు ఎల్లవేళలా గ్రామ ప్రజలపై ఉండాలని, అదే విదంగా గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పండగ జరుపుకోవాలని అన్నారు.
Also Read : గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి
గ్రామంలో ప్రతి ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుందని, రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో వ్యవసాయ రంగం పాడి పరిశ్రమలు అభివృద్ధి చెందేలా గ్రామ దేవతల దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.