జూనియర్ కళాశాల కు కమిటీ వేసిన ఎమ్మెల్యే మెచ్చా

0
TMedia (Telugu News) :

టీ మీడియా దమ్మపేట డిసెంబర్ 24

మండలంలోని నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థానిక ప్రభుత్వ పాఠశాల లో నిర్వహిస్తున్న సంగతి పాఠకులకు విదితమే ఈ క్రమంలో జూనియర్ కాలేజి కి పక్కా భవనం నిర్మాణం అయ్యేవరకు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు కమిటీ ని నియమించారు.ఈ సందర్భంగా శుక్రవారం తన నివాసం వద్ద నియామక పత్రాలను కమిటీ సభ్యులకు అందజేశారు. కమిటీ సభ్యులుగా దార యుగంధర్ ,దారా మల్లికార్జున్ రావు ,అర్ అజయ్ కుమార్ ,కెవి సత్యనారాయణ ,కే నాగార్జున,సిహెచ్ యుగంధర్ లను నియమించారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,పట్టణ అధ్యక్షులు యార్లగడ్డ బాబు, కోయ్యల అచ్యుత్ రావు,పానుగంటి చిట్టి బాబు,తదితరులు పాల్గొన్నారు.

MLA Macha nominated for junior college.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube