టీ మీడియా అశ్వారావుపేట నవంబర్ 30
మండలంలోని వినాయకపురం గ్రామంలో నిరుపేద కుటుంభానికి చెందిన వీర్నాల బ్రహ్మయ్య కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చుల కోసం మందులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్న వీరయ్య కుటుంబాన్ని వినాయకపురం గ్రామ తెరాస నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు దృష్టి కి ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందులను వివరించారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా ఆ కుటుబానికి వైద్య ఖర్చుల కొరకు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం తరఫున కూడా మరికొంత సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రసాద్, మారుతీ వసంతరావు, వీర్నాల హరి ప్రసాద్, ఉప్పల మురళి తదితరులు పాల్గొన్నారు.