కొల్లాపూర్ ఎమ్మెల్యే కనిపించడం లేదు

కొల్లాపూర్ ఎమ్మెల్యే కనిపించడం లేదు

1
TMedia (Telugu News) :

కొల్లాపూర్ ఎమ్మెల్యే కనిపించడం లేదు

 

టీ మీడియా, నవంబర్ 18, వనపర్తి బ్యూరో : కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్ష వర్ధన్ రెడ్డి ఆచూకీ తెలియడం లేదని ఆయన కనిపించుట లేదని టీపీసీసీ సభ్యులు రంగినేని అభిలాష్ రావు, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కొల్లాపూర్ పోలీస్ సిఐ యాలాద్రి కి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి గత 36 రోజులుగా నియోజకవర్గంలో ఎక్కడ కనబడటం లేదని అన్నారు. ఎమ్మెల్యే హర్ష వర్ధన్ ని 2022 అక్టోబర్ 26న ప్రగతి భవన్ కు తీసుకెళ్లారు అని, ఆరోజు నుండి ఈ రోజు వరకు ఎమ్మెల్యే నియోజకవర్గానికి కూడా రాలేదని అన్నారు. ఎమ్మెల్యేను బయటికి రానివ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని ఖైదీలుగా ప్రగతి భవన్లోనే ఎందుకు నిర్బంధించారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆణిముత్యాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు బయటకు వస్తే టిఆర్ఎస్ బిజెపి పార్టీలు కలిసికట్టుగా చేస్తున్న నాటకాలు,నీచ రాజకీయాలు ప్రజలకు తెలుస్తాయని కేసీఆర్ భయపడుతున్నారా ? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హార్షవర్ధన్ రెడ్డి ని కాపాడి తిరిగి నియోజకవర్గానికి తీసుకురావాలని పోలీసులను కాంగ్రెస్ నాయకులు కోరారు.

 

Also Read : ఇండిగో విమానంలో సాంకేతిక లోపం

 

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కంటే శివన్న , జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రెటరీ రఫీ ఉద్దీన్ ,కొల్లాపూర్ టౌన్ ఉపాధ్యక్షుడు బాబా , పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షుడు తగిలి కృష్ణయ్య ,రాష్ట్ర సోషల్ మీడియా సెక్రెటరీ మొట్టే పరమేష్ ,పెంట్లవెల్లి మండల యూత్ కాంగ్రెస్ బోగ్యం నరసింహ నాయుడు , తాలూకా సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజేష్ యాదవ్ ,ఎల్లూరు గ్రామ అధ్యక్షుడు పరశురాం యాదవ్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమ్మన్న నాయుడు,నరసింహ, హుస్సేన్,సూర్య నారాయణ,పరమేష్,కృష్ణ, శరత్ గౌడ్, మహమూద్, అశోక్,శ్రీను,గంగాధర్,పవన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube