గ్రామ సభలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
టీ మీడియా, నవంబర్ 25, ఖానాపూర్ : అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 ప్రకారం పోడు భూముల సర్వేపై ఖానాపురం మండలం బుధరావుపేట, మనుబోతుల గడ్డ గ్రామాలలో నిర్వహించిన పోడు భూముల సర్వే గ్రామ సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పోడు వ్యవసాయంపై కొన్ని సంవత్సరాలుగా ఆధారపడి బతుకుతున్నా గిరిజనులు మరియు గిరిజనేతరులకి ఏదో ఒక పద్ధతిలో హక్కులు కల్పించాలని సిఎం కేసిఆర్ చేస్తున్నటువంటి సంకల్పానికి ఈరోజు మరో మెట్టు ఎక్కుతున్న గిరిజనులకు మరియు గిరిజనేతరులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అన్నాడు. ఇందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే రైతులు ఆర్డీవో కి దరఖాస్తు చేసుకోవచ్చు.ఆ వివరాలన్నింటినీ సేకరించి ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది.
Also Read : గ్రామ పంచాయతీ పరిధిలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలి
ఇప్పుడైతే దరఖాస్తు పెట్టుకున్న వారి భూములను సర్వే చేయడం జరుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోడు భూములకు ROFR చట్టాన్ని అనుసరించి దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్క రైతు అభ్యర్థనను పరిశీలనలోకి తీసుకొని అందులోనే అర్హులను గుర్తించి డిసెంబర్ లో పట్టాలు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమం లో డీసీఎంస్ చైర్మన్ రామస్వామి నాయక్ ఎంపీపీ ప్రకాష్ రావ్ డిటిడివో ఎంపీడీఓ సర్పంచ్ కాస ప్రవీణ్ మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ కుంచరపు వెంకట్ రెడ్డి మస్తాన్ మౌలానా యాకుబ్ పాషా నాగరాజు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube