ముంపు జర్నలిస్టులకు అండగా మేముంటాం…

ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం చూపుతాం

1
TMedia (Telugu News) :

ముంపు జర్నలిస్టులకు అండగా మేముంటాం…
-ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం చూపుతాం
-రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
టి మీడియా,జూలై25, బూర్గంపాడు: గోదావరి వరద ముంపు ప్రాంత జర్నలిస్టులకు అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం విప్, పినపాక శాసన సభ్యులు , టిఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు . సోమవారం మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో గల జడ్పిటిసి క్యాంపు కార్యాలయంలో దుర్గం పార్ట్ మండలంలో ఇటీవల వచ్చిన గోదారి వరద ముంపు కు గురైన బూర్గంపాడు మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల కుటుంబాలకు జడ్పిటిసి దంపతులు కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు , మాజీ ఎంపీటీసీ ఇరవైండి వల్లూరుపల్లి వంశీకృష్ణ , టీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, సీనియర్ పాత్రికేయులు ఎన్టీవీ రిపోర్టర్ తాళ్లూరు శ్రీహరిబాబుల సహకారంతో నిత్యవసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ లకు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద జర్నలిస్టులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్న కామిరెడ్డి శ్రీలత దంపతులకు రామకొండారెడ్డి, వారి మిత్ర బృందాని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టుకు అండగా ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణతో ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

 

Also Read : టిఆర్ఎస్ హయాంలోనే శరవేగంగామధిర అభివృద్ధి

 

అదేవిధంగా ఐటిసి పరిశ్రమ స్థానిక ముంపు వాసులకు అండగా నిలవడం అభినందనీయమని అన్నారు. బూర్గంపాడు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కరకట్ట నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపు వాసులకు తక్షణ సాయంగా రూ 10వేలు, 20 కేజీల రేషన్ బియ్యం, నిత్యవసర సరుకులను అందిస్తున్నదని అన్నారు. ముంపు వాసులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ముంపు వాసులకు అందే సహాయం పై పర్యవేక్షిస్తున్నామని, ప్రతి ఒక్క ముంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే తక్షణ సహాయం నేరుగా అందుతుందని , అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో ఐటిసి యూనిట్ హెడ్ సిద్ధార్థ మహంతి, డీజీఎం HR శ్యామ్ కిరణ్,అడ్మిన్ చీఫ్ మేనేజర్ చెంగలా రావు, బూర్గం పహాడ్ జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాలమ్మ, ఐటిసి యూనియన్ ప్రెసిడెంట్ కనకమెడల హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి జి ఆర్ కే రెడ్డి, మాజీ ఎంపీటీసీ వల్లూరు పల్లి వంశీకృష్ణ,బూర్గంపాడు మండలం ,స్థానిక తెరాసా మండల నాయకులు రామ కొండా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్ మరియు పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube