బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ చేసిన:ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

బతుకమ్మ చీరలు ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ చేసిన:ఎమ్మెల్యే

టీ మీడియా సెప్టెంబర్‌ 24 బెల్లంపల్లి
:బెల్లంపల్లి నియోజకవర్గం లో పట్టణం లో మున్సిపాలిటీ 3, 9, 17, 18, 24, 25, 26వ వార్డుల్లో లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు మరియు ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేసారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు మంజూరు చేసిన ఆసరా పెన్షన్ కార్డులను మరియు దసరా పండగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు సమన్వయంతో లబ్ధిదారులకు వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని సూచించారు …
ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ , వైస్ చైర్మన్ సుదర్శన్ , కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, ఎమ్మార్వో కుమారస్వామి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు …

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube