ఎమ్మెల్యే లైంగికంగావేధింపులు..

కాపాడాలంటూ బీఆర్ఎస్ సర్పంచ్ మొర

0
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే లైంగికంగావేధింపులు..

-కాపాడాలంటూ బీఆర్ఎస్ సర్పంచ్ మొర

టీ మీడియా,మార్చి 10 స్టేషన్ ఘణపూర్, హనుమకొండ : జిల్లా స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తనను కోరికలు తీర్చాలంటూ వేధించాడని, తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తూ, ఒక దళిత మహిళా సర్పంచ్ నని చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపింది. ధర్మసాగర్ మండలం జానకిపురం గ్రామ సర్పంచ్ కురసపెళ్లి.నవ్య మాట్లాడుతూ… ఎమ్మెల్యే మాట కాదనడంతో గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తూ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, ధర్మసాగర్, వేలేరు మండలాల్లో అగ్రవర్ణాల నాయకులదే పెత్తనంగా, లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని కన్నీరు పెట్టుకుంది.ఎమ్మెల్యే మాట కాదనడంతో గ్రామాభివృద్ధికి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తున్నారని, ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదనిఆవేదన వ్యక్తం చేశారు. మీకు అక్కా చెల్లెల్లు లేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఆస్తులు, బంగారం, పొలాలు అమ్ముకుని రాజకీయం చేస్తున్నామన్నారు. నేతల కోరికలు తీర్చేందుకు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చామని తెలిపారు.

Also Read : శ్రీ‌ చైత‌న్య‌లో టీచ‌ర్లే బానిస‌లు..

నియోజకవర్గంలో రెండు మూడు వర్గాలు ఉండటం వలన అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. గత నెలలో మంత్రి కేటీఆర్ వేలేరులో పర్యటించినప్పుడు ఓ మహిళా ప్రజాప్రతినిధి తనను తీవ్రంగా అవమానించారన్నారు. ఇప్పటికైనా సదరు నేత మహిళలతో మంచిగా వ్యవహరించాలని హితవు పలికారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube