మహానందిశ్వరుని సేవలో ఎమ్మెల్యే శిల్పా

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 1, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి మహానందిశ్వర స్వామి వారిని బుధవారం శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం ఈవో గంజి మల్లికార్జున ప్రసాద్, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శిల్పా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయ అభివృద్ధిపై పలు కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube