ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన డిప్యూటీ స్పీక‌ర్

ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన డిప్యూటీ స్పీక‌ర్

1
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన డిప్యూటీ స్పీక‌ర్

టిమీడియా ,మార్చి 11హైద‌రాబాద్ : రాష్ట్రంలో మ‌ద్యం అమ్మ‌కాల‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ త‌ప్పుబ‌ట్టారు. ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబు శాస‌న‌స‌భ‌లో మాట్లాడుతూ.. హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌తి పాన్ షాపు బెల్ట్ షాపే.. ప్ర‌తి కిరాణ షాపు బెల్ట్ షాపే అని వ్యాఖ్యానించారు. అక్ర‌మ మ‌ద్యం అమ్ముతున్నార‌ని ఆరోపించారు.ఈ వ్యాఖ్య‌ల‌పై చైర్‌లో ఉన్న డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ స్పందించారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయొద్ద‌ని శ్రీధ‌ర్ బాబుకు డిప్యూటీ స్పీక‌ర్ సూచించారు. హైద‌రాబాద్ సిటీలో ఎక్క‌డా కూడా బెల్ట్ షాపు అనేది ఉండ‌దు.

Also Read : సీఎం కేసీఆర్ క్షేమంగా ఉండాలి

హైద‌రాబాద్ మొత్తంలో ఒక్క బెల్ట్ షాపు కూడా ఉండ‌దు. జిల్లాల్లో కూడా ఎట్ల ఉంట‌ది అంటే.. మంట‌ల్ హెడ్ క్వార్ట‌ర్స్ ద‌గ్గ‌ర ఎక్క‌డో ఒక చోట‌, 10 కిలోమీట‌ర్ల దూరంలో వైన్ షాపు ఉంట‌ది. అక్క‌డికి వెళ్లి తెచ్చుకునేందుకు ఇబ్బంది ప‌డుతార‌ని చెప్పి.. అదేదో తెచ్చి గ్రామాల్లో పెడుత‌రు. అయితే గ్రామానికి, కిర‌ణా షాపుల్లో, అక్క‌డ ఇక్క‌డ బెల్ట్ షాపులు ఉండ‌వని స్ప‌ష్టం చేశారు. గ‌తంలో ఎక్సైజ్ మంత్రిగా ప‌ని చేశాను.. తాను ఇక్క‌డ కూర్చొని చెప్పొద్దు కానీ చెప్పాల్సి వ‌స్తుంద‌ని డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ పేర్కొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube