రీడింగ్ రూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
టీ మీడియా,జూలై 20,మహాదేవపూర్:
ఏఐసీసీ మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మహదేవ్ పూర్ లో ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థిని విద్యార్థుల కోసం రీడింగ్ రూమ్ ను వారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ
ఉద్యోగాల కోసం పోటీపడే నిరుద్యోగ యువత కోసం పీజేఆర్ వారిచే 60 రోజుల పాటు కోచింగ్ సెంటర్ తో ఉచిత శిక్షణ ఇప్పించి రీడింగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.
Also Read : గోదావరికి కరకట్ట నిర్మించండి
ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగాలలో మంథని నియోజక వర్గ యువత ముందుండాలని ఏర్పాటు చేయడం జరిగింది.
ఉద్యోగాల కోసం పోటీపడే యువత రీడింగ్ రూమ్ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఉద్యోగాలు సాధించాలని సంకల్పనతో ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజాప్రతియాలు తదితరులు పాల్గొన్నారు.