పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

0
TMedia (Telugu News) :

పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

టీ మీడియా, డిసెంబర్ 12, వనపర్తి బ్యూరో : వనపర్తి నూతన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మంగళవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.కార్తీకమాసం సందర్భంగా గ్రామస్తులు చేపట్టిన ఈ పూజా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్, గ్రామస్తులు నరేందర్ రెడ్డి, వెంకటయ్య , ఆలయ అర్చకులు గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Also Read : నన్ను చూసేందుకు రావ్వొద్దు.. నేనే మీ ముందుకు వస్తా

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube