సింధు తపస్విని సన్మానించిన ఎమ్మెల్యే వనమా

సింధు తపస్విని సన్మానించిన ఎమ్మెల్యే వనమా

1
TMedia (Telugu News) :

సింధు తపస్విని సన్మానించిన ఎమ్మెల్యే వనమా
టీ మీడియా,ఏప్రిల్ 08,కొత్తగూడెం: ఇటీవలే అమెరికాలో జరిగిన పోటీలలో 2 గోల్డ్ మెడల్స్ సాధించిన టైక్వాండో ఇంటర్నేషనల్ ప్లేయర్ సింధు తపస్విని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారు ఘనంగా సన్మానించారు. గురువారం వనమా స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో హైదరాబాద్ నుండి పాల్వంచ తన గృహానికి వచ్చిన సింధు తపస్విని వనమా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సింధు తనకు వచ్చిన మెడల్స్ ను వనమాకు చూపించి, ఈ పర్యటన వివరాలను తెలిపారు.

Also Read : పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన సీఐ

వనమా మాట్లాడుతూ పాల్వంచ కు చెందిన మహిళలకు ఈ మెడల్స్ రావడం గర్వకారణమన్నారు. సింధు మరెన్నో మెడల్స్ సాధించి పాల్వంచ ప్రతిష్టను అంతర్జాతీయంగా కూడా నిలపాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజు గౌడ్, బత్తుల మధు చందు, కంచర్ల రామారావు, దుర్గాప్రసాద్, డేవిడ్, వెంకటేశ్వర్లు, సురేష్, హబీబ్,ఆర్ఎంపీ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube