ఎంఎల్ఏ పరామర్శలు

టీమీడియా మార్చి 9 జూలూరుపాడు

1
TMedia (Telugu News) :

ఎంఎల్ఏ పరామర్శలు

టీమీడియా మార్చి 9 జూలూరుపాడు:
వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు ఆదేశానుసారం బుధవారం జూలూరుపాడు ఎంపీపీ లావుడియా సోనీ, మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు చౌడం నరసింహారావు నేతృత్వంలో, టీఆర్ఎస్ బృందం మండలంలో పలు గ్రామాల సందర్శించి, కుటుంబాల వారిని పరామర్శించారు.
కాకర్ల గ్రామానికి చెందిన వేముల సుబ్బయ్య ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఒక కాలు తొలగించడం జరిగింది. వారిని పరామర్శించారు.
శంభుని గూడెం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ చిమట లక్ష్మీనారాయణ బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలుసుకొని వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు. అదే గ్రామానికి చెందిన పునెం రామస్వామి ఇటీవల అనారోగ్యంతో మరణించారు వారి చిత్రపటానికి నివాళులర్పించారు.

Also Read : అన్నదానం చేసిన కాటికపరులు
అనంతారం గ్రామానికి చెందిన సానం శంకరయ్య అనారోగ్యంతో మరణించారు వారి చిత్రపటానికి నివాళులర్పించారు. అదే గ్రామానికి చెందిన గణప శ్రీను అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వారిని ఓదార్చి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు మండల కన్వీనర్ యాదళ్ల పల్లి వీరభద్రం , కాకర్ల ఎంపిటిసి పొన్నెకంటి సతీష్,బొజ్య తండా సర్పంచ్ లావుడియా కిషన్ లాల్, శంభుని గూడెం సర్పంచ్ దొడ్డ వెంకటరామారావు, అనంతారం సర్పంచ్ యదళ్ల పల్లి కళావతి, సీనియర్ నాయకులు రామిశెట్టి నాగేశ్వరరావు, యువజన అధ్యక్షులు గుగులోత్ చంటి నాయక్, అనంతరం గ్రామ శాఖ అధ్యక్షులు ఉసికల వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా గుగులోత్ రాంబాబు మరియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube