బుగ్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే
టీ మీడియా, ఫిబ్రవరి 18, బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామం లోని శ్రీ బుగ్గ రాజేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి జాతర సంధర్భంగా బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య, వారి సతీమణి దుర్గం జయ తార బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖసంతోషలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నియోజకవర్గ ప్రజలకు మహా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుగ్గ ఆలయ కమిటీ ఛైర్మన్ మాసాడి శ్రీదేవి- శ్రీరాములు ,మున్సిపల్ చైర్మన్ శ్వేత ,వైస్ చైర్మన్ సుదర్శన్ బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్ కన్నాల సర్పంచ్ స్వరూప-వెంకటస్వామి టౌన్ ప్రెసిడెంట్ బొడ్డు నారాయణ ఎంపీటీసీ సుభాష్ రావు ఎస్.సీ సెల్ ప్రెసిడెంట్ కిరణ్ పట్టణ యువజన అధ్యక్షులు సన్నీ బాబు మరియు ఇతర ప్రజాప్రతినిధులు,ఆలయ కమిటీ సభ్యులు,కౌన్సిలర్స్ మరియు కో ఆప్షన్ సభ్యులు,నాయకులు శ్రీధర్ ,నెల్లి కృష్ణ గోలి శివ ,భీమ గౌడ్ ఉదయ్, ఇతర బీ.ఆర్.ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.