కౌన్సిలర్ మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులు

కౌన్సిలర్ మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులు

0
TMedia (Telugu News) :

కౌన్సిలర్ మృతదేహానికి ఎమ్మెల్యే నివాళులు

టీ మీడియా, మే 13, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో కౌన్సిలర్ రాధాకృష్ణ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి.
వనపర్తి పట్టణం 31 వార్డు కౌన్సిలర్ రాధాకృష్ణ కుటుంబానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని రాధాకృష్ణ మృతి తీరని లోటని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘా రెడ్డి రాధాకృష్ణ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ALSO READ :కలకలం సృష్టిస్తున్న అజయ్ కుమార్ సంభాషణ ఆడియో..
కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా కొనసాగుతూ 31 వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీలో గట్టి పట్టున్న నాయకుడిగా పేరొందిన బండారు రాధాకృష్ణ అనారోగ్యంతో మృతి చెందడం దురదృష్టకమన్నారు.రాధాకృష్ణ మృతి కుటుంబానికే కాక కాంగ్రెస్ పార్టీకి సైతం తీరని లోటు అని ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ స్థానిక కౌన్సిలర్ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త లక్కాకుల సతీష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube