ఎమ్మెల్సీ బాలసానిలక్ష్మణరావు ఏజెన్సీ పర్యటన

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్, 16, భద్రాచలం

ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మరియు నియోజకవర్గఇంచార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈరోజు స్థానిక ఐ.టి.డి.ఎ హౌసింగ్ గెస్ట్ హౌస్ నందు ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ సమస్యలపై మాట్లాడుతూ త్వరలో అంబేద్కర్ సెంటర్ నుండి చర్ల రోడ్డు సెంట్రల్ డివైడర్స్ మరియు సెంట్రల్ లైటింగ్ కునవరం రోడ్డు సెంటర్ డివైడర్స్ మరియు సెంటర్ లైటింగ్ ఏర్పాటు విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడుతూ వాటి ప్రతిపాదనను వెంటనే పంపాలని అట్లనే భద్రాచలం లో డంపింగ్ యార్డ్ కు పంచాయితీ ద్వారా నిధులు మంజూరైనట్లు అతి త్వరలో వాటి పనులు ప్రారంభమవుతాయని అట్లనే దళిత సంఘాల నాయకులు భద్రాచలం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు నిమిత్తమై, మెమోరాండం ఇవ్వడమైనది. అందుకు వారు స్పందిస్తూ దానికి సంబంధించిన విషయాలు తెలుసుకొని వెంటనే కలెక్టర్ గారికతో చరవాణి ద్వారా అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు కు సంబంధించిన పనులు చేయవలసిందిగా కోరడమైనది. దానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగింది.

తర్వాత టిఆర్ఎస్ మహిళా మండలి అధ్యక్షురాలు భర్త ఆరోగ్యరీత్యా బాగు లేని కారణంగా వారింటికి వెళ్లి వారిని పరామర్శించిచడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులుఅరికీళ్ళ తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి కొండి శెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, చింతా డి చిట్టి బాబు, అధికార ప్రతినిధి రాంబాబు, జాయింట్ సెక్రెటరీ బీ. రాజీవ్, సీనియర్ నాయకులు తాళ్ల రవికుమార్, చుక్కసుధాకర్, యూత్ నాయకులు వెంకట్, మహిళా మండల నాయకులు జాస్తి, గంగా భారతి, ములకలపల్లి మదారి, కేతినేని, లలిత, కమల, అనురాధ, పద్మ ప్రియ, బి బి, లక్ష్మీకాంత తదితరులు పాల్గొనడం జరిగినది.

MLC Balasanilakshmana Rao Agency and Constituency In-charge Dr Tellam Venkatarao today convened a meeting of key functionaries at the Local ITDA.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube