ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

0
TMedia (Telugu News) :

ఘనంగా కవిత జన్మదిన వేడుకలు
టి మీడియా,మార్చి14,రామకృష్ణా పూర్:టీ.బి.జి.కె.ఎస్ గౌరవ అధ్యక్షురాలు,ఎం.ఎల్.సి కవిత జన్మదిన వేడుకలు ఆదివారం రామకృష్ణా పూర్ పట్టణంలో టి.బి.జి.కె.ఎస్ నాయకులు, టి.ఆర్.ఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు.సూపర్ బజార్ చౌరస్తా టి.బి.జి.కె.ఎస్ కార్యాలయంలో నాయకులు కేకు కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.

also read:ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించిన డాక్టర్ కోట రాంబాబు

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ టి.ఆర్.ఎస్ సమన్వయ కర్త అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కే.సి.ఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించారని అన్నారు.టి.బి.జి.కె.ఎస్ బలోపేతానికి కవిత ఎనలేని కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య,బోయిని పల్లి నర్సింగరావు,మహిళ నాయకులు పార్వతి విజయ, అలుగుల శ్రీలత,నరెడ్ల కల్పన, రామిడి ఉమారాణి లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube