బీజేపీ ఏం చేసినా కేసీఆర్‌ వెనక్కి తగ్గరు

కవిత కీలక వ్యాఖ్యలు

1
TMedia (Telugu News) :

బీజేపీ ఏం చేసినా కేసీఆర్‌ వెనక్కి తగ్గరు

– కవిత కీలక వ్యాఖ్యలు

టీ మీడియా,ఆగస్టు 22, హైదరాబాద్‌: దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత ఉన్నారని బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ క్రమంలో బీజేపీపై సంచలన కామెంట్స్‌ చేశారు. ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్‌ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్‌ను మానసికంగా కృంగదీసేందుకే, బద్నాం చేసేందుకే బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడేదే లేదు.

 

Also Read : ఉగ్ర‌వాద చ‌ట్టం కింద ఇమ్రాన్ ఖాన్‌పై కేసు న‌మోదు

బీజేపీ కక్ష పూరితంగానే నాపై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ఏం జరిగినా కేసీఆర్‌ వెనక్కి తగ్గరు. ఆయన పోరాటం ఆపరు. దేశ అభివృద్ధి కోసం కేసీఆర్‌ ప్రతిక్షణం ఆలోచిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయాలని బీజేపీ చూస్తోంది. మీరు అధికారంలో ఉన్నారని విచారణ సంస్థలు, మీడియాను అడ్డం పెట్టుకుని మమ్మల్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు’’ అంటూ క్లారిటీ ఇచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube