వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా : జనసేన లో చేరిక

వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా : జనసేన లో చేరిక

0
TMedia (Telugu News) :

వైసీపీకి ఎమ్మెల్సీ రాజీనామా : జనసేన లో చేరిక

టీ మీడియా, డిసెంబర్ 27, అమరావతి : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో ఇన్‌చార్జిలు, సిట్టి్ంగ్‌ ఎమ్మెల్యేల మార్పిడి ఆ పార్టీ నాయకుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొందరు సిట్టింగ్‌లకు నో ఛాన్స్‌ అని బాహటంగానే ప్రకటించడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పార్టీ నుంచి తప్పుకుని ఇతర పార్టీల వైపు దృష్టిని సారిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌ బుధవారం జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ వంశీ కృష్ణయాదవ్‌ మాట్లాడుతూ వైసీపీలోని కొన్ని శక్తుల కారణంగా ఆ పార్టీకి రాజీనామా చేశానని వెల్లడించారు. వైసీపీ నుంచి మరికొన్ని చేరికలు ఉంటాయని ఆయన తెలిపారు.

Also Read : సమన్వయంతో ప్రజాపాలనను విజయవంతం చేయాలి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube