రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి దుర్మరణం

0
TMedia (Telugu News) :

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి దుర్మరణం

టీ మీడియా, డిసెంబర్ 15, పశ్చిమగోదావరి : రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యా ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ శుక్రవారం దుర్మరణం చెందారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెరుకువాడ జాతీయ రహదారిపై ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అక్కడికక్కడే మృతి చెందారు. భీమవరంలో జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన కార్యక్రమానికి మద్దతు తెలిపేందుకు ఏలూరు నుంచి కారులో వచ్చిన ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన కారు డ్రైవర్‌, గన్‌మెన్‌, పర్సనల్‌ అసిస్టెంట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని 108 అత్యవసర వాహనంలో హుటాహుటీన భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన సమయంలో షేక్ సాబ్జీ సీటు బెల్ట్ ధరించలేదని పోలీసులు తెలిపారు.

Also Read : పార్లమెంట్‌ ఉభయసభలు సోమవారానికి వాయిదా

ప్రమాదం ధాటికి అతని ఛాతీ, తలపై తీవ్రమైన గాయాలు అవ్వడంతో దుర్మరణం చెందినట్లు తెలిపారు. ఏఎస్సై సూర్యనారాయణ, ఎంపీడీవో కొండలరావు, ఇతర అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతదేహాన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి పట్ల పలువురు కార్యకర్తలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube