–ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్లే పోగు వెంకటేశ్వర్లు మాదిగ
టీ మీడియా,డిసెంబర్18,పినపాక;
బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వల్లే పోగు వెంకటేశ్వర్లు మాదిగ
డిమాండ్ చేశారు.
పినపాక మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ…. బీజేపీ
కేంద్రంలో అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి ఏడేళ్లు గడిచిన మాట నిలబెట్టుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంటులో మాట్లాడకపోవడం మాదిగలను మాదిగ ఉపకులాలను బాధ కల్గిస్తుందని,నిజంగా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఒప్పించి వర్గీకరణ బిల్లు పెట్టేలా బీజేపీపై ఒత్తిడి పెంచాలని, లేనిపక్షంలో బీజేపీని గ్రామాల్లో తిరగనీయమని మాదిగల్ని మోసం చేసిన ఏ పార్టీ బతికి బట్ట కట్టిన చరిత్ర లేదని వర్గీకరణ చేయకపోతే మాకు ప్రధాన శత్రువు బీజేపి అవుతుందని, వర్గీకరణ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కొప్పుల అన్నయ్య మాదిగ, శీను మాదిగ, వంకాయల జంపయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.