హద్దు అదుపు లేని రెస్టారెంట్లను మూసివేయాలి. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు పల్లె పోగు..!

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 10, పినపాక;

పినపాక మండలంలోని బయ్యారం క్రాస్ రోడ్ లో బయట రెస్టారెంట్ అని బోర్డు పెట్టి లోపల బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్న వారిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు, పినపాక నియోజకవర్గ ఇన్చార్జి వల్లే పోగు వెంకటేశ్వర్లు
అన్నారు.
ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…ఏజెన్సీలో అత్యధికంగా ఆదివాసీలు ఎస్సీలు, ఎస్టీలు, బిసీలు మైనార్టీలు నివసిస్తున్న ఏజెన్సీ ప్రాంతంలో రోడ్డుమీద బారు షాపులు,రహదార్ల వెంట ఉండొద్దని నిబంధనలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్న అటువంటి రెస్టారెంటు,బెల్టు షాపుల యజమానులపై తక్షణమే సంబంధిత అధికారుల చర్యలు తీసుకోవాలని అన్నారు.

M

లేనిపక్షంలో జిల్లా అధికారులని కలవడం జరుగుతుందని ఈ ఈ షాపులు రోడ్డు మీదనే ఉండటంవల్ల చాలామందికి ఇబ్బంది కరంగా ఉందని తక్షణమే ఈ రెస్టారెంట్లను మూసివేయాలని లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్, ఎన్ఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్ ఆర్ పి ప లాలూ, మణికంఠ కొప్పుల సాయిబు తదితరులు పాల్గొన్నారు.

Restaurants without boundary should be closed.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube