మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మార్పీఎస్ నేతలు

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మార్పీఎస్ నేతలు

0
TMedia (Telugu News) :

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు మద్దతు ప్రకటించిన ఎమ్మార్పీఎస్ నేతలు

టీ మీడియా, నవంబర్ 16, మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ కు ఎమ్మార్పీఎస్ మద్దతు తెలిపింది. తామంతా మంత్రికి బాసటగా నిలుస్తామని ఆ సంఘం పేర్కొంది. జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ రోడ్ సమీపంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు రాయికంటి రాందాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా తయారు చేసిన ప్లకార్డులను మంత్రి ఆవిష్కరించారు. బహుజనుల సంక్షేమం ఎంతో కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు తాము మద్దతుగా నిలుస్తామని తెలిపారు. కులమతాలకు అతీతంగా అందరూ బాగుండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ నేతలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా ఆ మహనీయుని అతి పెద్ద విగ్రహాన్ని హైదరాబాద్ లో ప్రతిష్ఠించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Also Read : న్యూస్‌ క్లిక్‌ ఆరోపణలపై నెవెల్లీరాయ్ సింగమ్‌కు ఈడి సమన్లు

ఈ జాతి మేలుకొలుపు కోసం తాము కష్టపడి పనిచేశామన్నారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని హామీనిచ్చారు. తనకు మద్దతు తెలిపినందుకు ఎమ్మార్పీఎస్ కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగమేశ్వర్, పరమేశ్వర్, అశోక్, అనిల్, చంద్రమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube