మోడల్ మార్కెట్ ఖమ్మం ఏ ఏం సి

-మంత్రి తుమ్మల ఆదేశాలు మెరకు రాష్ట్ర స్థాయి బృందం పరిశీలన

0
TMedia (Telugu News) :

మోడల్ మార్కెట్ ఖమ్మం ఏ ఏం సి

-మంత్రి తుమ్మల ఆదేశాలు మెరకు రాష్ట్ర స్థాయి బృందం పరిశీలన

టి మీడియా, డిసెంబర్ 29, ఖమ్మం బ్యూరో : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశముల మేరకు శ్రీయుత సంచాలకులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, తెలంగాణ ప్రభుత్వము, హైదరబాద్ వారు వ్యవసాయ మార్కెట్ కమిటీ. ఖమ్మం ని మోడల్ మార్కెట్ గా రూపొందించుటలో భాగంగా త గురు, శుక్రవారం హైదరబాదు నుండి టెక్నికల్ టీమ్ (ఆర్కిటెక్చర్ బృందం), ఇంజినీర్స్, డ్రోన్ సర్వేయర్స్ వారు మిర్చి యార్డు, అపరాల యార్డు, పత్తి యార్డును మరియు మార్కెట్లో ఉన్న అన్ని రకాల కట్టడాలను సందర్శించి సర్వేచేయటము జరిగింది.

మోడల్ మార్కెట్ కొరకు కావలసిన వసతులు గురించి అధికారులతో, వ్యాపారులతో సమావేశము ఏర్పాటు చేసి రైతు విశ్రాంతి భవనంభోజనశాల, అన్ని యార్డుల యందు విశాలమైన పెద్ద షేడ్లు, వన్ వే గేట్లు, ఖమ్మం మార్కెట్ ప్రాంగణములో ఉన్న సేట్ట్ వేర్ హౌజింగ్ గోదాములను స్వాధీనం పరుచుకొవడము, కమీషన్దారుల కొరకు షాపులు, గోదాములు, సెంట్రల్ లైటింగ్స్, డ్రైనేజిలు, శిధిలా వ్యవస్థలో ఉన్న కొన్ని పాత కట్టడాలను తొలగింపు, క్యాంటీన్లు, ఆఫీస్ కార్యాలయము, ఫైర్ ఫైటింగ్, గేట్ ఎంట్రీ రూములు, అన్ని యార్డుల నందు కంపూటర్ ల్యాబ్లు, గ్రేడింగ్ ల్యాబ్లు, మార్కెట్ కమిటీ చుట్టూ ఉన్న మార్కెట్ స్థలాలను కలపుకొని మార్కెట్ను విస్తరిం చటము మొదలైన వాటి గురించి చర్చించటము జరిగింది.

Also Read : బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరిక

ఇట్టి కార్యాక్రమము నందు హైదరబాద్ నుండి ఆర్కిటెక్చర్ & ఆర్బన్ ప్లానింగ్ కన్సల్టెంట్స్ బృందం చిలకమర్రి శ్రీకామల్, సుంకరా ప్రవిణ్, సుంకరా స్మితా, ఇంజినీర్ ఉమామహేశ్వర రావు, డ్రోన్ సర్వేయర్ పి. శ్రీధర్ బాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్యక్షకార్యదర్శులు చిన్ని క్రిష్ణరావు, మెంతుల శ్రీశైలం, కోశాధికారి తల్లాడ రమేష్, ఉపాధ్యక్షులు జి.వై నరేష్, సెక్రెటరీ మణ్యం క్రిష్ణ, దిగుమతి శాఖ అధ్యక్షకార్యదర్శులు దిరిశాల వెంకటేశ్వర్లు, ముత్యాం ఉప్పల్రావు, ఎగుమతిశాఖ అధ్యక్షులు నల్లమల్ల ఆనంద్, అపరాల శాఖ కార్యదర్శి తేరాల ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి రుద్రక్షుల మల్లేశం, గ్రేడ్-2 కార్యదర్శి బుక్యా బజార్, సహాయ కార్యదర్శి యండి. వజీరుద్దీన్ మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube