మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన

1
TMedia (Telugu News) :

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన
టీ మీడియా,జూలై4, జగిత్యాల :

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి శ్రీదేవి పై జరిగిన భౌతిక దాడిని ఖండిస్తూ ఈరోజు మండల కేంద్రంలోని కొడిమ్యాల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రిన్సిపల్. బి. మోహన్ మాట్లాడుతూ సమస్యలుంటే చర్చలు, చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి తప్ప ఈ విధంగా దాడి చేయడం శోచనీయమని, ఇది విద్యా వ్యవస్థపై, ఉపాధ్యాయులపై జరిగిన దాడిగా భావిస్తూ, బాధ్యులపై చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు.

 

Also Read : ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పరీక్ష తేదీలు ఖరారు

ఇలా అనేక చోట్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ పై వివిధ రకాలుగా ఒత్తిడులు, దాడులు కొనసాగుతున్నాయి. కావున ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ లోకం కోరుతుంది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జె. శ్రీధర్, డి. అనూప్ రెడ్డి, టి. శ్రీనివాస్, ఎం. రాజేశం, టి. స్వప్న, వి. శ్రీధర్, వి. జగదీష్, వి. సౌజన్య, కె. చంద్ర శేఖర్, జె. ఇందిర రాణి, కె. లత, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube