మణిపూర్ భగ్గుమన్నా ఇజ్రాయెల్ వార్‌పైనే మోదీకి ఆసక్తి
మణిపూర్ భగ్గుమన్నా ఇజ్రాయెల్ వార్‌పైనే మోదీకి ఆసక్తి
మణిపూర్ భగ్గుమన్నా ఇజ్రాయెల్ వార్‌పైనే మోదీకి ఆసక్తి
– రాహుల్ గాంధీ
టీ మీడియా, అక్టోబర్ 16, న్యూఢిల్లీ : ఓవైపు మణిపూర్ మండుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం పట్ల అధిక ఆసక్తి కనబరుస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ మణిపూర్ హింసాకాండను విస్మరించి ఇజ్రాయెల్‌లో ఏం జరుగుతుందనే దానిపై ప్రధాని, భారత ప్రభుత్వం ఆసక్తి చూపుతుండటం తనకు విస్మయం కలిగిస్తోందని అన్నారు. ఈ ఏడాది జూన్‌లో తాను మణిపూర్ సందర్శించినప్పుడు అక్కడ చూసిన విషయాలను నమ్మలేకపోయానని చెప్పారు. మణిపూర్‌ను బీజేపీ నాశనం చేసిందని, ఇప్పుడది ఓ రాష్ట్రం కాదని, రెండు రాష్ట్రాలని మైతీ, కుకి వర్గాల మధ్య ఘర్షణలను ప్రస్తావిస్తూ వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్నారు. మహిళలను లైంగిక వేధింపులకు గురిచేశారు..
Also Read : బీజేపి, బీఆర్ఎస్ లను సాగనంపుదాం.
చిన్నారులను చిదిమేశారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా మణిపూర్‌ను సందర్శించడం ముఖ్యమనే విషయాన్ని ప్రధాని మోదీ గుర్తించలేదని అన్నారు. మేలో మణిపూర్‌లో హింస ప్రజ్వరిల్లినప్పటి నుంచి ఇంతవరకూ ప్రధాని మోదీ ఆ రాష్ట్రాన్ని ఇప్పటివరకూ సందర్శించకపోవడం సిగ్గుచేటని రాహుల్ చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube