హైదరాబాద్‌లో ప్రధాని మోడీ టూర్
-కట్టుదిట్టమైన భద్రత
టి మీడియా, మే 24,హైదరాబాద్: ఈనెల 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మోదీ రానున్న ఐఎస్బీ క్యాంపస్‌ను ఎస్పీజీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. కార్యక్రమంలో 930 మంది విద్యార్థులు పాల్గొననున్నారు. ఇందులో 330 మంది విద్యార్థులు పంజాబ్‌లోని మొహాలీకి చెందిన వారు. 930 మంది విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్స్‌ను అధికారులు పరిశీలించారు. మోదీకి వ్యతిరేకంగా పోస్టులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. అలాగే విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్‌ను కూడా ఎస్పీజీ అధికారులు చెక్ చేస్తున్నారు.
Also Read : కేసీఆర్ పాలనలో దగా పడ్డ రైతులు
నో ఎంట్రీ….
మరోవైపు సోషల్ మీడియాలో మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినవారికి ఐఎస్బీ వార్షికోత్సవానికి అనుమతి నిరాకరించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 930 మంది విద్యార్థుల ఫేస్బుక్, ఇనస్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను అధికారులు పరిశీలించారు. 330 మంది పంజాబ్‌లోని మొహాలీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ క్రమంలో రైతు ఉద్యమం నేపథ్యంలో పంజాబ్ విద్యార్థులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఐఎస్బీలో ప్రధాని మోదీ గంట పాటు గడపనున్నారు. ఎనిమిది మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేసి.. మొక్క నాటనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube