లొంగిపోయిన మహిళా మావోయిస్టు

లొంగిపోయిన మహిళా మావోయిస్టు

0
TMedia (Telugu News) :

లొంగిపోయిన మహిళా మావోయిస్టు
టీమీడియా, ఆగస్టు 6, చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ ఓఎస్డి కార్యాలయంలో జిల్లా ఎస్ పి సతీష్ కుమార్ ఐపీఎస్ మరియు ఓ ఎస్ డి కృష్ణకాంత్ ఐపిఎస్ ఎదుట ఎటపాక మండలం సాలి బుడిపె గ్రామానికి చెందిన పొడియం జోగమ్మ అలియాస్ రితిక (18) అ నబడి మహిళా మావోయిస్టు నంది పోయింది. ఈ సందర్భంగా చింతూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఓ ఎస్ డి జి కృష్ణకాంత్ మాట్లాడుతూ ఎటపాక మండలం సాలిపేట గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో తరచూ మావోయిస్టు నాయకులు గీత, సంధ్య అనే ఏ సీఎం కేడర్ వచ్చి సమావేశాలు పెట్టి ప్రజలను ఆకట్టుకునేలా చేశారని భారీ ఆటపాటలకు ఆకర్షితులైన రితిక అనే అమ్మాయి 2019 సంవత్సరం డిసెంబర్ నెలలో దడ నెంబర్ గా నియమితులైన దన్నారు. ప్రస్తుతం చర్ల ఏరియా కమిటీలో పార్టీ మెంబర్గా ప్రతి మెంబర్గా పనిచేస్తుందని 2019 నుండి ఇప్పటి వరకు సుమారు రెండు నేరాలు ఏవోబీ పరిధిలో గల వివిధ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి అన్నారు. 2021 సంవత్సరం లో ఏప్రిల్ నెలలో జీ రంగూడ గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొనిదని తెలిపారు.

 

Also Read : బిహార్‌లో కల్తీ మద్యం తాగి 11మంది మృతి

 

ఈ ఘటనలో 22 మంది పోలీసులు ముగ్గురు మావోయిస్టులు మరణించారు అని, తెలిపారు. నందు పోవడానికి గల కారణాలు తెలుపుతూ ప్రజల నుండి పార్టీకి సహాయ సహకారాలు లేకపోవడం. నుండి వ్యతిరేకత రావడం మరియు మావోయిస్టులు తమ పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వడం. కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం ఇటీవల తన తల్లి అనారోగ్యంతో మరణించడంతో తన కుటుంబ సభ్యులతో సాధారణ జీవితం గడపడం కోసం ఉండిపోవడం జరిగింది అని. ప్రభుత్వ మరియు పోలీసు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు గిరిజన గ్రామాల్లో జరుగుతున్న మరియు ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఉండిపోవడం జరిగిందన్నారు. తక్షణ సాయంగా ఆయన పది వేల రూపాయలను, బియ్యం నిత్య సర వస్తువులు అందజేశారు. ప్రభుత్వం నుండి కూడా లక్ష రూపాయల వరకు సాయం అందుతుందని. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. క్షణికావేశంలో ఆకర్షితులైna వారు అజ్ఞాతవాసం వీడాలని జనజీవన స్రవంతిలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube