ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తున్నారా..?

ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తున్నారా..?

0
TMedia (Telugu News) :

ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తున్నారా..?

 జీవితంలో చాలామంది చాలా సందర్భాలలో అప్పు చేస్తుంటారు. అప్పు లేకుండా జీవితం గడవదు. ఒక్కోసారి ఎంత డబ్బు ఉన్న వ్యక్తి అయినా సమయానికి చేతిలో డబ్బు లేకుంటే అప్పు చేయాల్సి వస్తుంది. అయితే కొందరు సరైన ఆర్థిక ప్రణాళిక లేక ఆర్థిక ఇబ్బందులతో అప్పులు చేసి, అప్పు ఇచ్చిన వారికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుగా డబ్బు ఇచ్చి, సమయానికి ఆదుకొని, తీరా వారికి అవసరమైన సమయంలో డబ్బు ఇవ్వకుంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తులు ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అందుకే అప్పు ఇచ్చే విషయంలో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆర్థిక శాస్త్ర నిపుణులు.

 

SO READ: అంత్యక్రియలు పూర్తైన కొడుకు తిరిగొచ్చాడు

 

ప్పులు ఇస్తున్నారా? అయితే అవతలి వ్యక్తిలో ఈ లక్షణాలు ఉండాలి తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర అప్పు తీసుకోవడానికి చాలామందికి ఇబ్బంది ఉండదు. అదే బ్యాంకుల నుండి అప్పు తీసుకోవాలంటే, బ్యాంకులు అనేక నిబంధనలు పెడతాయి. ఆస్తులను తనఖా పెట్టుకుని మరి అప్పులు ఇస్తాయి. ఒకవేళ అప్పు తీర్చకుంటే ఏం చేయాలనేది కూడా ముందే నిర్ణయించుకొని, బ్యాంకులు అప్పులు ఇస్తాయి. కానీ నిజజీవితంలో బయట అప్పు ఇచ్చే వాళ్ళు ఇవన్నీ పరిగణలోకి తీసుకోరు. ముఖ్యంగా సమీప బంధువులు, తెలిసినవారు అని భావించిన దగ్గర వారు అవసరానికి డబ్బులు అప్పుగా ఇస్తారు. అయితే ఆ అతి విశ్వాసమే అనేక సందర్భాల్లో ఎంతో మంది డబ్బులు ఇచ్చే వారి కొంప ముంచుతుంది. అందుకే అప్పు ఇచ్చేటప్పుడు కచ్చితంగా అవతల వ్యక్తి లో కొన్ని లక్షణాలను పరిగణలోకి తీసుకోవాలని చెబుతారు.

A LSO READ :తమ్ముడినే నరికి చంపిన అన్న

అప్పు తీసుకునే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవాలి అందులో ముఖ్యమైనది వ్యక్తిత్వం. ఒక వ్యక్తికి మనము డబ్బు అప్పుగా ఇవ్వాలంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకున్న వారమై ఉండాలి. ఆ వ్యక్తి డబ్బు ఎందుకు అప్పు చేస్తున్నాడు? తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చే మనస్తత్వం ఉన్నవాడా? కాదా? ఏదైనా మాటిస్తే మాటమీద నిలబడే వ్యక్తి నా? కాదా? అసలు అతను అప్పు చేస్తున్న కారణం ఏంటి? అతని ఆర్థిక పరిస్థితి ఏంటి? తిరిగి చెల్లించగలిగే స్తోమత ఉందా? తిరిగి చెల్లించక పోయిన భరించగలిగే శక్తి మనకు ఉందా? అతను ఇబ్బంది పెడితే ఒత్తిడికి గురి కాకుండా సమస్యను పరిష్కరించుకోగలిగే సత్తా ఉందా? అనే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube