మనీ ప్లాంట్‌కి ఈ వస్తువును ముడివేస్తే..

మనీ ప్లాంట్‌కి ఈ వస్తువును ముడివేస్తే..

0
TMedia (Telugu News) :

మనీ ప్లాంట్‌కి ఈ వస్తువును ముడివేస్తే..

లహరి, ఫిబ్రవరి 13, కల్చరల్ : సాధారణంగా ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుంది. ఈ మొక్క ఆకులు అందంగా కనిపిస్తాయి. దీని ప్రత్యేకత కారణంగా, ప్రజలు దీనిని ఇల్లు, బాల్కనీ, గది, కార్యాలయం ఇలా ప్రతిచోట పెడుతుంటారు. మనీ ప్లాంట్ మొక్క నేల, నీటిలో ఎక్కడైనా సరే సులభంగా పెరుగుతుంది. కనీస సంరక్షణ ఉంటే చాలు. ఇకపోతే, వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఉన్న ఇంట్లో సానుకూల శక్తి తిరుగుతుంది. వాస్తులో, మనీ ప్లాంట్ గురించి చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. అయితే ఈ ఒక్క పరిహారం చేసిన వెంటనే మనీ ప్లాంట్ వల్ల మీ ఇంట్లో సంపద పెరిగి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారని,ఇంట్లో డబ్బు వర్షం కురుస్తుందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్ ని ఎప్పుడూ ఈశాన్య దిశలో నాటాలి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మనీ ప్లాంట్ ని నేల మీద నాటకూడదు. ఎందుకంటే ఈ చెట్టు ఆకులు నేలపై పడకూడదని అంటారు. ఇంట్లో మనీ ప్లాంట్ ఉంచడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఎందుకంటే మనీ ప్లాంట్ శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఇంట్లో మనీ ప్లాంట్‌ను సరైన దిశలో ఉంచడం వల్ల శుక్రుడు అనుకూలంగా ఉంటాడు.

Also Read : ఆత్మస్థైర్యమే ఆమె బలం

దాంతో మీ ఇంట ఆనందం, శ్రేయస్సు నిలుస్తాయి. శుక్రవారం రోజు మనీ ప్లాంట్ కి ఎర్రదారం కట్టడం వల్ల ఇంట్లో అనుకూల ప్రభావం ఉంటుంది. ఇలా ఎర్ర దారం కట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి సుఖ, సంతోషాలు చేకూరుతాయి. ఇంట్లో డబ్బు కొరత తొలగిపోతుంది. మనీ ప్లాంట్‌కు ఎర్రదారం కట్టిన తర్వాత ఎంత వేగంగా పెరుగుతుందో మీరే చూస్తారు. మనీ ప్లాంట్‌లో ఎర్రదారం కట్టేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం అవసరం. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీ దేవిని పూజించి ధూప దీపాలు వెలిగించండి. మనీ ప్లాంట్‌పై మీరు కట్టబోయే దారాన్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి నమస్కారించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారికి హారతిని ఇచ్చి, ఎర్రటి దారానికి కుంకుమ పూయాలి. ఇప్పుడు ఈ దారాన్ని మనీ ప్లాంట్ మూలానికి కట్టండి. ఇలా చేసిన కొన్ని రోజుల తర్వాత మీరు దాని అద్భుతమైన ప్రయోజనాలను చూస్తారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube