ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు బదిలీ శాశ్వతంగా రద్దు చేయండి

కామనురు శ్రీనువాసులురెడ్డి

1
TMedia (Telugu News) :

ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు బదిలీ శాశ్వతంగా రద్దు చేయండి ..కామనురు శ్రీనువాసులురెడ్డి

టి మీడియా,ఏప్రిల్21,కడప : ప్రజా పంపిణీ వ్యవస్థలో అమలు చేయనున్న నగదు బదిలీ పథకాన్ని తక్షణం రద్దు చేయాలని
సిఐటియు రాయచోటి కమిటీ డిమాండ్ చేసింది.

ఆహార భద్రతను దెబ్బతీసేందుకే ఈ పథకాన్ని రూపొందించారని పేర్కొంది. తక్షణమే దానిని రద్దు చేసి అర్హులందరికీ చౌక డిపోల ద్వారా 14రకాల నిత్యావసర సరుకులు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రాయచోటి లో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కామనురు. శ్రీనువాసులురెడ్డి జిల్లా కార్యదర్శి ఏ. రామాంజనేయులు మాట్లాడుతూ . తాత్కాలికంగా నగదు బదిలీ పథకాన్ని లబ్ధిదారులను అంగీకార పత్రాలకు ప్రజాభిప్రాయం సేకరణ వాయిదా వేసిన తిరిగి చేయడానికి సిద్ధంగా ఉంది. నగదు బదిలీ పథకాన్ని ప్టెంట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు రాష్ట్రంలో 5 మున్సిపాలిటీలను గాజువాక, అనకాపల్లి, కాకినాడ. నరసాపురం, నంద్యాల) ఫైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, ఈ నెల 25 నుండి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిందని. దీనిలో భాగంగా ఈ నెల 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు లబ్దిదారులతో అంగీకార పత్రాలు తీసుకుంటున్నారని తెలిపారు.

Also Read : తెలంగాణ సాహిత్యం వాస్తవికతను ప్రతిబింబిస్తుంది

పేదలకు ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా కుదించడానికే ఈ నగదు బదిలీ పథకు ఉద్దేశ్యం. కేంద్ర బిజెపి ప్రభుత్వం గ్యాస్ సిలిండరుకు రూ.600 నచ్సిడీ ” ద్వారా నగదు బదిలీ చేస్తామని ప్రారంభంలో చెప్పింది. క్రమేపీ బహిరంగ మార్కెట్ ధరలతో ముడిపెట్టి ప్రభుత్వం ఇస్తున్న సబ్పిడిని పూర్తిగా తగ్గించి నేడు సిలిండరుకు రూ.3 నుండి రూ.10 మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారు. నగదు బదిలీకి ముందు రూ.350-౦కు వస్తున్న వంట గ్యాస్ ధర ప్రస్తుతం రూ.1,000కు పెంచి బిజెపి ప్రభుత్వం ప్రజలకు తీవ్రమైన ద్రోహం చేసింది. రేపు ప్రజాపంపిణీ వ్యవస్థలో కూడా ఇదే జరుగుతుంది. అన్నారు . ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ,కార్మికులు అంగీకారం మేరకే నగదు బదిలీని అమలు చేస్తామని చెబుతోంది. దీంతోపాటు కేంద్ర ఆహార భద్రతాచట్టం ద్వారా లబ్ది పొందుతున్న వాళ్ళు నగదు. బదిలీకి రావాలంటే ఆహార భద్రత చట్టం నుండి బయటకు వస్తేనే నగదు బదిలీకి అర్హులని చెబుతున్నారు. ఇవి పాడి గేదెను వదులుకొని రావడం లాంటిది. ప్రజలు తెలియక మోసపోయి అంగీకరించిన తరువాత ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని అనివార్యంగా తగ్గిస్తారు.’ అని సిఐటియు పేర్కొంది. ‘బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలకు నగదు బదిలీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఉదాహరణకు ప్రస్తుతం మార్కెట్ ధరలతో నిమిత్తం లేకుండా రూపాయికే కిలో బియ్యం పేదలకు అందుతుంది. రేపు బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.60 లకు పెరిగితే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మాత్రం రూ.12 ఉంటుంది. అంటే రూపాయికి కూడా బియ్యం పొందే పేదలు రూ.42 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది. ఈ కారణంగా పేదలకు రేషన్ షాపు ద్వారా బియ్యం అందక, ప్రభుత్వం నుండి సహాయం అందక మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసర సరుకులు కొనలేక అర్ధాకలితో అలమటించే పరిస్థితి. వస్తుంది.’ అని వివరించింది.

Also Read : రైస్ మిల్లుల్లో అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలి

కేంద్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ, వంట గ్యాస్, విద్యుత్ మొదలగు పేదలకు ఇస్తున్న సబ్సిడీలన్నింటిలో నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టి రానురాను కోత విధిస్తూ మొత్తాన్ని రద్దు చేసి పేదలకు తీవ్రమైన ద్రోహం చేయాలని చూస్తోంది. బిజెపి ప్రభుత్వం చట్రంలో పడి వైఎస్సార్సిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నష్టం చేయడానికి సిద్ధం కావడం అన్యాయం. ప్రజాపంపిణీ కోసం అనివార్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ద్వారా రైతుల నుండి ధాన్యం సేకరించాల్సి వస్తోంది. ఈ కారణంగా రైతులు ప్రైవేటు మార్కెట్ దోపిడీకి గురికాకుండా ఉండడానికి కొంత వరకైనా దోహదపడుతుంది. భవిష్యత్తులో ఈ ప్రజాపంపిణీ వ్యవస్థ దెబ్బతింటే రైతుల ధాన్యం కొనే దిక్కు లేక కార్పొరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, మధ్య దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేయాల్సి వస్తుంది. ఇప్పటికే రబీలో ధాన్యం కొనలేదు. ఆంధ్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ధాన్యం అమ్ముడుపోక ఆందోళనలు సాగుతున్నాయి. రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై మరిన్ని ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది. అని తెలిపింది. ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న ప్రజాపంపిణీ వ్యవస్థను బలహీన పరిచే నగదు బదిలీ పథకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సిఐటియు స్పష్టం చేసింది. నగదు బదిలీ పథకం అమలును నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. అంగీకారపత్రాలు ఇవ్వొచ్చని ప్రజలకు ,కార్మిక వర్గానికి సిఐటియు జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube