ఆందోళ‌న వ‌ద్దు.. గాలి ద్వారా మంకీపాక్స్ సోక‌దు

-ఫీవ‌ర్ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్‌

1
TMedia (Telugu News) :

ఆందోళ‌న వ‌ద్దు.. గాలి ద్వారా మంకీపాక్స్ సోక‌దు

-ఫీవ‌ర్ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్‌
టి మీడియా,జూలై25హైద‌రాబాద్ : మంకీపాక్స్ గురించి ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఫీవ‌ర్ హాస్పిట‌ల్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ శంక‌ర్ స్ప‌ష్టం చేశారు. ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తికి ద‌గ్గ‌రగా ఉన్న వారికే మంకీపాక్స్ సోకే అవ‌కాశం ఉంద‌న్నారు. గాలి ద్వారా మంకీపాక్స్ సోక‌ద‌ని, పెద్ద‌గా ద‌గ్గిన‌ప్పుడు వ‌చ్చే తుంప‌ర్ల ద్వారానే సోకే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.మంకీపాక్స్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రిలో చేరిన బాధితుడి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని డాక్ట‌ర్ శంక‌ర్ వెల్ల‌డించారు. బాధిత వ్య‌క్తి నుంచి న‌మూనాలు సేక‌రించి, పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌కు పంపించామ‌ని చెప్పారు.

 

Also Read : అవినీతి నియంత్రణతో పురోభివృద్ధివైపు

రేపు సాయంత్రానికి రిపోర్టు వ‌స్తుంద‌న్నారు. ఈ నెల 6వ తేదీన బాధితుడు కువైట్ నుంచి వ‌చ్చాడ‌ని తెలిపారు. బాధితుడు నీర‌సం, జ్వ‌రంతో ఉన్నారు. దీంతో కామారెడ్డిలోని ఓ ప్ర‌యివేటు హాస్పిట‌ల్‌కు వెళ్లారు. శ‌రీరంపై ఉన్న ద‌ద్దుర్లు మంకీపాక్స్ మాదిరిగా ఉండ‌టంతో ఫీవ‌ర్ హాస్పిట‌ల్‌కు వ‌చ్చార‌ని పేర్కొన్నారు. రోగికి ద‌గ్గ‌రగా ఉన్న ఆరుగురిని ఐసోలేష‌న్‌లో ఉంచామ‌ని స్ప‌ష్టం చేశారు. మంకీపాక్స్ ల‌క్ష‌ణాల‌తో విదేశాల నుంచి వ‌చ్చిన వారు స‌మాచారం ఇవ్వాల‌న్నారు. 6 నుంచి 13 రోజుల్లో వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని డాక్ట‌ర్ శంక‌ర్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube