ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు

1
TMedia (Telugu News) :

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు

టీ మీడియా, ఆగస్టు3,అశ్వరావుపేట : నియోజకవర్గ కేంద్రమైన అశ్వరావుపేటలో మొదటి సెగ్మెంట్ పరిధిలో తల్లిపాల వారోత్సవాలల్లో భాగంగా శ్రీమంతాలు, అన్నప్రసన్న కార్యక్రమాలు సిడిపిఓ రోజా రాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాలు శిశువుకి చాలా మంచిదని రోగనిరోధక శక్తి పెరుగుతుంది అని, తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి కూడా ఎంతో ఆరోగ్యకరమని అన్నారు.

Also Read : ఈ-శ్రమ్ కార్డుల నమోదు

ముర్రుపాలు బిడ్డలకు తప్పనిసరిగా పట్టాలని, ఈ కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్లు మరియు ప్రజాప్రతినిధులతో కలసి చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో కూరగాయలతో చేసిన వినూత్న బొమ్మలు చిన్నారులు ఆసక్తి గా తిలకించారు.ఈ వేడుకలకు అంగన్వాడీ పర్యవేక్షకురాలు విజయలక్ష్మి, ఎంపీటీసీ వేముల భారతి ప్రతాప్,పంచాయితీ పాలకమండలి సభ్యులు ఉపాద్యాయుల సూర్య ప్రకాష్,రెహన బేగం,అంగన్వాడీ టీచర్స్ జ్యోతి, ఉష, రాజేశ్వరి, శిరీష, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube