చక్కని ప్రణాళిక విజయానికి సోపానం

జిల్లా ఎస్పీ

1
TMedia (Telugu News) :

చక్కని ప్రణాళిక విజయానికి సోపానం: జిల్లా ఎస్పీ

టీ మీడియా మే 14 ,రాజన్న సిరిసిల్లా:

సిరిసిల్ల పట్టణంలోని గీతనగర్ లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీపీటీ్ఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యం లో నిర్వహించిన టెట్ మోడల్ టెస్ట్ కి ముఖ్య అతిథిగా హాజరై టెట్ పరీక్షకు కి హాజరైన అభ్యర్థులకు దిశనిర్ధేశం చేశారు. అనంతరం టెట్ మోడల్ టెస్ట్ యెక్క కీ ని రిలీస్ చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీస్.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.
టీపీటీ్ఫ్ రాజన్న సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో జిల్లాలో టెట్ మోడల్ టెస్ట్ పరీక్ష నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. ప్రభుత్వం నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు వెలువరిచిందని, అభ్యర్థులు సరైన ప్రణాళిక తో చదివి ప్రభుత్వ ఉద్యోగం కల సాకారం చేసుకోవచ్చని అన్నారు.

Also Read : నవ వధువు అదృశ్యం

చక్కని ప్రణాళిక తో చదవాలని అలాగే ఇలాంటి మాక్ టెస్ట్ లని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. టెట్ పరీక్షకు హాజరైన సుమారు 300 మంది అభ్యర్థులకు ఎస్పీ గారు శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో టీపీటీ్ఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్ రెడ్టి, దుమాల రమానాథ్ రెడ్టి, రాష్ట్ర కౌన్సిలర్ లు పాతూరి మహేందర్ రెడ్డి, గుజ్జునేని వేణుగోపాల్ రావు, నాయకులు హాజు నాయక్, పురుషోత్తం, సత్తు రవి, పురం వాసుదేవరావు, చంద్రశేఖర్, బూస రాజేందర్, మైలారం తిరుపతి, కట్కూరు రవీందర్, బచ్చు అశోక్, రవిబాబు, వెంకటేశ్వర్లు, దరిపెళ్లి శ్రీనివాస్ రెడ్డి, సుల్తాన్ శ్రీనివాస్, రాజేందర్, గుండెల్లి రవీందర్, ప్రతాప్ లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube