మహిళలు ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలి

మేయర్ నీరజ, కార్పొరేటర్ కృష్ణ

1
TMedia (Telugu News) :

మహిళలు ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలి: మేయర్ నీరజ, కార్పొరేటర్ కృష్ణ
టి మీడియా, మే16, ఖమ్మం: సత్య మార్గం సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో 41 వ డివిజన్లో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణా తరగతులు ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన వారికి ట్రైనింగ్ సర్టిఫికెట్స్ నగర మేయర్ నీరజ, డిప్యూటీ మేయర్ పాతీమా, డివిజన్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ చేతుల మీదుగా అందజేశారు. మేయర్ మాట్లాడుతూ కుట్టు శిక్షణ నేర్చుకున్న మహిళలందరూ ఈ శిక్షణ ద్వారా ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్పొరేటర్ కృష్ణ మాట్లాడుతూ తన డివిజన్ లో 30 మంది మహిళలు చక్కగా శిక్షణ నేర్చుకుని ఆర్థికంగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు.

Also Read : 32 కేజీల గంజాయిపట్టి వేత

ఈ సందర్భంగా సహకరించిన కార్పొరేటర్ కృష్ణ, కల్పన, అనురాధలకు సొసైటీ ప్రెసిడెంట్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీ లక్ష్మీ సొసైటీ కోశాధికారి నగేష్ , డివిజన్ తెరాస అధ్యక్ష , కార్యదర్శి లు వెంకటేశ్వర్లు, నవీన్ కుమార్ , సుడా డైరెక్టర్ ముక్తార్ ,దామోదర్ , పారుపల్లి అనిల్ , జానీ తదితరుల పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube