టీ మీడియా,డిసెంబర్ 4,కరకగూడెం:
ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు,కర్షక నాయకుడు,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ.కొణిజేటి రోశయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని,వారు ఎన్నో దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించిరని కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కో ఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ అన్నారు.
కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించి,మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపం కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కో ఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు,యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్,మహిళా నాయకురాలు చందా వెంకటరత్నమ్మ,కార్యదర్శి షేక్ యాకూబ్ తదితరులు తెలియజేశారు.