మణుగూరు నూతన మేజిస్ట్రేట్ గా మౌర్యతేజ్.

0
TMedia (Telugu News) :

– సమాజానికి న్యాయ వృత్తి ఎంతో అవసరం .

– చట్టాలపై ప్రజలను చైతన్య పరచడం న్యాయ వ్యవస్థ లక్ష్యము .

టీ మీడియా, నవంబర్‌ 30 మణుగూరు .

మణుగూరు నూతన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మౌర్యతేజ్ మంగళవారం మండంలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఆయన నూతన మేజిస్ట్రేట్ గా భాధ్యతలు చేపట్టారు . న్యాయవాదులందరూ మౌర్యతేజ్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ నూతనంగా వచ్చిన మేజిస్ట్రేట్ కి న్యాయవాదులందరినీ పరిచయం చేశారు .
ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ ….చట్టాలపై ప్రజలను చైతన్య పరచడం న్యాయ వ్యవస్థ లక్ష్యమని , సమాజానికి న్యాయ వృత్తి ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు .ఈ కార్యక్రమంలో న్యాయవాదులు , పత్రికా విలేకరులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube