అశేషంగా తరలిరాండి అభివృద్ధిని ఆశీర్వదించండి

- బీఆర్ఎస్ నాయకులు నందిమల్ల శారద అశోక్

0
TMedia (Telugu News) :

అశేషంగా తరలిరాండి అభివృద్ధిని ఆశీర్వదించండి

– బీఆర్ఎస్ నాయకులు నందిమల్ల శారద అశోక్

– మాజీ టెలికాం బోర్డ్ సభ్యులు

టీ మీడియా, అక్టోబర్ 25, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణములో గురువారం జరిగే ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కెసిఅర్ పాల్గొని ప్రసంగిస్తారు. కాబట్టి ప్రజలందరూ,అభివృద్ధిని కాంక్షించే ప్రజాసంఘాలు, కులసంఘాలు,కార్మిక,కర్షక, విద్యార్థి,మేదావులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసి నిరంజన్ రెడ్డి ని మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నాయకులు నందిమల్ల శారద అశోక్ మాజీ టెలికాం బోర్డ్ సభ్యులు కోరారు. నిరంజన్ రెడ్డిని ఎందుకు ఆశీర్వదించాలంటే దశాబ్దాల కల రోడ్ల విస్తరణ చేసినందుకు.రారాజులను తలపిస్తూ చెరువులను ఆధునీకరంచినందుకు. జెఎన్టియు ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చినందుకు.మెడికల్ కాలేజీ తెచ్చినందుకు.500పడకల మాతాశిశు వైద్యాలయం ఏర్పాటు చేసినందుకు. రవీంద్రభారతి మించిన టౌన్ హాల్ కట్టించినందుకు, సమీకృత దుఖాన సముదాయం నిర్మించినందుకు, సిద్దిపేట తరహా కూరగాయల మార్కెట్ నిర్మించినందుకు, విద్యార్ధి మేదావుల కోసం అధునుతనమైనా గ్రంధాలయం నిర్మించినందుకు.ఆహ్లాదకరమైన ఏకో పార్కు ఏర్పాటు చేసినందుకు.ముస్లిం సోదరుల కోసం షాదిఖాన నిర్మించినందుకు.

Also Read : వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ పార్టీలకు బుద్ధి చెప్పాలి

కులవృత్తులు చేయూత వారికి కుల సంక్షేమ భవనాలు నిర్మించినందుకు, అంతర్గత రోడ్లను అధునీకరించినందుకు, కె.జి టు పి.జి విద్యాలయాలు ఏర్పాటు చేసినందుకు, నేషనల్ హైవే తలపిస్తూ రోడ్ల మార్గములో పచ్చని చెట్లు,మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేసినందుకు ఇట్లా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి రాస్తే రామాయణం వింటే భాగవతం అవుతుంది. వనపర్తి పట్టణం మరింత అభివృద్ధి చెంది భావితరాలకు ఆదర్శంగా నిలవాలంటే మరోసారి నిరంజన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube