పాదయాత్రకు కదులుదాం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి .వి శ్రీనివాసరావు

1
TMedia (Telugu News) :

పాదయాత్రకు కదులుదాం
ప్రభుత్వం పనిపడదాం.

-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి .వి శ్రీనివాసరావు

టీ.మీడియా,సెప్టెంబర్.22,చింతూరు : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులరా ఏకంకండి..చేయి చేయి కలుపుదాం పాదయాత్రను కొనసాగిద్దాం. ప్రభుత్వ భరతం పడతాం. అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వివి శ్రీనివాస రావు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లోని మల్లె తోట గ్రామంలో బుధవారం పోలవరం నిర్వాసిత సభనుద్దేశించి ఆయన నిర్వాసితులకు పిలుపునిచ్చారు. మండల కార్యదర్శి సిసం సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దీనంతటికీ కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అని విమర్శించారు.పోలవరం పోరు పాదయాత్రకు మల్లె తోటలో పాదయాత్రను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. గిరిజన కొమ్ము కోయ నృ త్యాలతో రేలా పాటలు డోలు దరువులతో ఉత్సాహంగా కొనసాగింది.

Also Read : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

మల్లె తోట గ్రామం మొదలుకొని పొలమూరు గ్రామం చేరేసరికి పోరుబాట పాదయాత్రలో పాల్గొన్న నాయకులకు ఉలుమూరు గ్రామ మహిళలు హారతి పట్టి తిలకం దిద్ది స్వాగతించారు. అక్కడి నుండి తిమ్మిరి గూడెం. ముకునూరు మీదుగా ఎ జీ కోడూరు గ్రామనికి పాదయాత్ర చేరుకు0ది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండల పార్టీ నాగేశ్వరరావు. కుంజా సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకట్. మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు. మొరం రంగమ్మ మల్లం సుబ్బమ్మ ఎంపీటీసీలు మురుగన్ లక్ష్మి మేక రాజ్కుమార్ లావణ్య. మరియు కడియం లక్ష్మణ్ కారణం సుబ్బారావు మొట్టుమ్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube