ప్రజా ఆశీర్వాద సభకు కదలాలి
-సభా ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ నామ
టి మీడియా, నవంబర్ 20,వైరా : వైరాలో మంగళవారం జరిగే సీఎం ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయా లని బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత , ఖమ్మం పార్లమెంట్ సభ్యులు , నియోజకవర్గ ఇంచార్జి నామ నాగేశ్వరరావు ప్రజలకు ,పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు . ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్,పార్టీ అభ్యర్థి బాణోత్ మదన్ లాల్ , స్థానిక నాయ కులతో కలిసి సీఎం కేసీఆర్ సభా ఏర్పాట్లును పరిశీ లించారు . ఈ సందర్భంగా స్థానిక నేతలకు, సభ నిర్వాహకులకు నామ పలు సూచనలు చేశారు.ఈ సంద ర్భంగా నామ మాట్లాడుతూ సీఎం సభకు ఊరువాడా తరలివచ్చి బ్రహ్మరథం పట్టాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం సభలకు మంచి స్పందన లభిస్తుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలివచ్చి, జయప్రదం చేస్తున్నారని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మూడోసారి సీఎం అయ్యేది కేసీఆరేనని నామ స్పష్టం చేశారు. మదన్ లాల్ ను మంచి మెజార్టీతో గెలిపించి, అసెంబ్లీకి పంపించాలని నామ ఓటర్లకు విజ్ణప్తి చేశారు.
Also Read : హార్బర్ అగ్నిప్రమాద బాధితులకు నష్టపరిహారమివ్వాలి
ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి మదన్ లాల్, ఎమ్మెల్యే రాములు నాయక్ ,పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు ,దిశా కమిటీ సభ్యులు కట్టా కృష్ణార్జునరావు, ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులు బోయినపల్లి కృష్ణ మూర్తి, చిత్తారు సింహాద్రి యాదవ్ ,వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపూడి సీతారాములు, కౌన్సిలర్లు వనమా విశేశ్వ రరావు, కొత్త వెంకటేశ్వరరావు కాపా మురళీకృష్ణతో పాటు మోరంపూడి ప్రసాద్ , తన్నీరు రవి, చల్లగుండ్ల నాగేశ్వరావు పసుపులేటి మోహన్ రావు భూమాత కృష్ణమూర్తి , సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సింగవరపు నరేష్, నామ సేవా సమితి నుంచి చాపలమడుగు సన్నీ, ఈసం మురహరి, తదితరులు పాల్గొన్నారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube