అలాంటి సినిమాలే తీస్తా..

అలాంటి సినిమాలే తీస్తా..

1
TMedia (Telugu News) :

అలాంటి సినిమాలే తీస్తా..

టీ మీడియా,మార్చి 22,సినిమా: మంచి ఫ్యాన్ బేస్ ఉన్న నటీమణుల్లో రాణీ ముఖర్జీ ఒకరు. అందుకే ఈ నటి సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. ఈ భామ నటించిన ‘బంటీ ఔర్ బబ్లీ 2’ ఇటీవలే విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ నటి తాజాగా ‘మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే’ అనే సినిమాలో నటిస్తోంది. కాగా మార్చి 21న 44వ పుట్టిన రోజు జరుపుకున్న ఈ సీనియర్ నటి ఓ ఇంటర్వ్యూలో తన సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.రాణి మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకూ సినీరంగంలో నా ప్రయాణం ఎంతో బాగా సాగింది. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుందని ఆశిస్తున్నా. మంచి మనసున్న దర్శకులు, నిర్మాతలతో కలిసి పని చేసే అదృష్టం దక్కింది. వాళ్లు నన్ను ప్రతిసారి తెరపై కొత్తగా ఆవిష్కరించారు.
నా హద్దులను విస్తృతం చేసుకోవడానికి డిఫరెంట్‌గా ఉంటే ప్రతి ప్రాజెక్ట్‌ని చేయాలనుకుంటున్నాను.

Also Read : రాజమౌళి నరకం చూపించాడు

ఈ 25 ఏళ్లలో నా ప్రయాణం ఎంతో కఠినతరంగా ఉంది. అయినప్పటికీ కృషి, పట్టుదలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది.రాణీ ఇంకా మాట్లాడుతూ.. ‘నా కెరీర్ ప్రారంభం నుంచి కూడా నేను కథలో కీలకంగా ఉండే, బలమైన పాత్రలనే చేస్తూ వచ్చాను. అలాంటి క్యారెక్టర్స్‌తో సినిమాకు ఉపయోగపడాలని ప్రయత్నించాను. అలాగే మహిళా ప్రాధాన్యత ఉండి భారతీయ మహిళల జీవితాలను చూపించే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలని కోరుకున్నాను. అలాంటి పాత్రలను చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో కూడా పాధాన్యం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube